బస్టాండ్ ను పరిశీలించిన ఎంపీడీవో
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో చేపడుతున్న రోడ్డు పనుల దృష్ట్యా...పనులు వేగవంతం గా సాగేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు...శుక్రవారం ఆర్డీఓ ..ఆర్.అండ్ బి. ఈ . ఈ. మండల అధికారులు,కాంట్రాక్టర్,ఆర్.అండ్. బి.ఏ. ఇ.ఇచ్చోడ ఎస్. ఐ.ఇచ్చోడ గ్రామపంచాయతీ ఈవో లతో సమావేశం నిర్వహించడం జరిగింది..ఇందులో భాగంగా శనివారం ఎంపీడీవో లక్ష్మణ్,ఇచ్చోడ గ్రామ పంచాయతీ ఈ. ఓ సూర్య ప్రకాష్ ,ఆర్టీసీ డిప్యూటీ ఎస్. ఎం వి. గోపాల్ రెడ్డి , ఆర్టీసీ కంట్రోలర్ వేణుగోపాల్,రోడ్డు పనుల సూపర్వైజర్ లతో కలిసి పాత బస్టాండ్ ను పరిశీలించడం జరిగింది. బై పాస్ ల వద్ద బస్ లను నిలిపితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండదని...బస్ స్టాండ్ లో అయితే ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణాలు చేయవచ్చని కాబట్టి బస్ లు ఆదిలాబాద్ నుండి ఇచ్చోడ బస్టాండ్ కు వచ్చి నిర్మల్ వైపు వెళ్లేందుకు ,నిర్మల్ నుండి ఇచ్చోడ బస్టాండ్ కు వచ్చి ఆదిలాబాద్ వైపు వెళ్లేందుకు బస్టాండ్ లో కావల్సిన పనులను పరిశీలించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది...రేపటి ఆదివారం లోగ బస్టాండ్ లో బస్ లు వచ్చి వెళ్లేందుకు బస్టాండ్ వరకు గ్రావెల్ ను,కంకర తారు రోడ్డు వేసెలా చూడాలని సూచించారు...