సెకండ్ ఏ ఎన్ ఎమ్ ల పరీక్ష రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి
. ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
సెకండ్ ఏ ఎన్ ఎమ్ ల పరీక్ష రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి
- సెకండ్ ఏ ఎన్ ఎమ్ ల ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి వినతి పత్రం
తెలంగాణ బ్యూరో (ఆరోగ్య జ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్యూలతో పాటు వివిధ పథకాల్లో పనిచేస్తున్న ఆరిక కార్యకర్తలందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చలో కమిషన్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సెకండ్ ఏఎన్ఎంలో వివిధ పథకాల కింద పనిచేస్తున్న మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ప్రజలకు ఆరోగ్యపరంగా ఎన్నో వైద్య సేవ మన్నారు. మా పిల్లలు తోపాటు మేము పరీక్ష రాయాలంటే ఎలా సాధ్యమవుతుందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమ్మమ్మలు నానమ్మలో వయసులో ఉన్న మేం కంప్యూటర్ పరీక్ష రాయగలమా ఇది ప్రభుత్వం ఆలోచించాలి అని వారు పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సెకండ్ ఏఎన్ఎంల కు వివిధ పథకాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు పరీక్షలు రద్దుచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా అపార్ట్మెంట్ చేసుకోవాలన్నారు. గత 20 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఎన్నో సేవలు చేశామన్నారు. సెకండ్ ఏఎన్ఎంలకు ఎలాంటి అలవెన్స్ లేకుండా కేవలం వేతనంపై పనిచేసామన్నారు. ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళింది సెకండ్ ఏ ఎన్ ఎమ్ లని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇటు వెదురు నిర్వహించాల అటు చదువుకోవాలా అన్న ఆలోచన ప్రభుత్వమే చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల పరీక్షలో పాసైన ఏఎన్ఎంలతో సమానంగా మేం పోటీ పడలేమని మా వయసు పైబడిందని ప్రస్తుతం చాలామంది సెకండ్ ఏఎన్ఎంలు అనారోగ్యాల తో బాధపడుతున్నారని వారు ప్రభుత్వా నికి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధురిమ, సుజాత, జ్యోతి, అరుణ, శ్రీవిద్య, నాసిమా బేగం, స్వప్న, కాతశ్మి, పార్వతి, కవిత, రాజకుమారి, మాధవి, వసంత తో పాటు తదితరులు పాల్గొన్నారు.