సర్వీస్ లో ఉన్న సెకండ్ ఏఎన్ఎం లను రాత పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
*రాత పరీక్ష రద్దుచేసి - కాంట్రాక్ట్ ఏ.ఎన్.ఎం లందరిని రెగ్యులర్ చేయాలి.*
టి యు ఎం హెచ్ ఇ యు - సిఐటియు డిమాండ్.
*వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ.ఎ ఎన్. ఎంలు,ఆర్బన్ హెల్త్ సెంటర్స్ ఏ.ఎన్.ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను యధావిధిగా రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో వైద్య ఆరోగ్యశాఖలోని కొంత మందిని రెగ్యులర్ చేయడం హర్షించదగ్గ విషయమే కాని అదే సందర్భంలో మెజార్టీ ఉద్యోగులను విస్మరించడం అత్యంత దుర్మార్గమని, ప్రభుత్వం వెంటనే అందరిని బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.వైద్య ఆరోగ్య రంగానికి బలమైన ఆయువు పట్టుగా ఉండి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏ.ఎన్.ఎంలు రెండు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నేటికీ రెగ్యులర్ కాకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు, ఏఎన్ఎంలు ఏకకాలంలో 36 రకాల రికార్డులు ఆన్ లైన్ లో,ఆఫ్ లైన్ లో నమోదు చేస్తున్నారని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అన్నారు, గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలకు 8,9,10 పి.ఆర్.సి ల ప్రకారం బేసిక్ పై ఇచ్చారు, కానీ ప్రస్తుతం తెలంగాణలో తొలి పిఆర్సి బేసిక్ పే ఇవ్వకుండా 30% వేతనాలు పెంచడం వలన ఏఎన్ఎంలు ప్రతినెలా 5 వేల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,ప్రభుత్వం వెంటనే బేసిక్ పై ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న పి.ఆర్.సి ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని అన్నారు,రెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ ఎ.ఎన్.ఎంలు,అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న కనీస వేతనాలు ఇవ్వకుండ, రెగ్యులర్ చేయకుండ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు, ప్రభుత్వం వెంటనే వీరందరిని ఎలాంటి షరతులు లేకుండ,రాత పరీక్షను రద్దుచేసి యధావిధిగా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం జరుగుతుందని అధికారులకు,ప్రభుత్వానికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియుద్దీన్, రాష్ట్ర కోశాధికారి ఏ కవిత,వివిధ జిల్లాల నాయకులు డి కిరణ్మయి,కే సరోజ,పి మంజుల,సంపూర్ణ,నేహా, మమత,లక్ష్మి,దైవమని తదితరులు పాల్గొన్నారు.