మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
ఉమెన్ రైట్స్ టీం వుమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ చైర్ పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి
మహిళలకు చుట్టాలపై అవగాహన ఉండాలనిఉమెన్ రైట్స్ టీం వుమెన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నేషనల్ చైర్ పర్సన్ డాక్టర్ జ్ఞాన సుందరి అన్నారు. జూలూరుపాడు ఎంపీటీసీ సీతా కుమారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకు ముసలి వాళ్ళ మీద దాడులు పెరగడంతో పాటు విద్యార్థులు భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటున్నారని తెలిపారు. కేవలం నిషా ద్వారానే జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు మత్తు పదార్థాలు సేవించడం వల్ల అటు విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబ కలహాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిషా తీసుకోవడం వల్ల యువత చదువుకునే భవిష్యత్తులో అనేక రకాల చెడు అలవాట్లకు లోన్ అవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా కళాశాలలో పాఠశాలలో ర్యాగింగ్లు చేయడం చెడు అలవాట్లకు లోన్ అవ్వడం దీనితో విద్యార్థుల జీవితాలు నాశనం అవ్వడం పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోని మత్తు పదార్థాలు అంటే గంజాయి సేవించడం తాగుడుకు బానిస అవడం లాంటివి చేస్తున్నారని తెలిపారు వీటికి యువత దూరంగా ఉన్నప్పుడే సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకోవచ్చు అని పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళలు కూడా అన్ని చట్టాలు తెలిసి ఉండాలని పేర్కొన్నారు. మహిళలు సమాజంలో వీరవని తల్లా ఉండాలని తెలిపారు.