జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నరేందర్
అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): అదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ శనివారం రోజు బాధ్యతలను స్వీకరించారు. అదిలాబాదులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో మళ్లీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నరేంద్ర రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు.