Sports & Games

Breaking News

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాజీ ఉప రాష్ట్రపతితో నిమ్మరాజు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాజీ ఉపరాష్ట్రపతి తో నిమ్మరాజు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రముఖ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకలు సోమ, మంగళవారం ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ను  సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి అనేకానేక వార్తా కథనాలు రాయడం తన అదృష్టం గా చెప్పారు. ఇక్కడ పనిచేసిన పలువురు గురుదేవులు, అలాగే చదివిన విద్యార్థులతో నేటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిమ్మరాజు తెలిపారు. పర్యావరణ విభాగంలో గురుదేవునిగా పనిచేస్తున్న తన మిత్రుడు డాక్టర్ శశిధర్ ను నాయుడుకు పరిచయం చేశారు.
1988లో నాటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీని సందర్శించారు వీరి పర్యటనలో నాటి విసి శ్రీ జివి జగన్నాథరాజు, ఐఏఎస్ అధికారి శ్రీ సతీష్ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావు (ఆంధ్రపత్రిక) పాల్గొనడం జరిగింది.