Sports & Games

Breaking News

317 జీవో బాధ్యతలు చలో గాంధీభవన్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451,9848289499

అదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): జీవో నెంబర్ 317 పై రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఇందుకు గాను ఈనెల 2న చలో గాంధీభవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారని ఈ కార్యక్రమానికి ఆరోగ్య కార్యకర్తలు ఫిమేల్ఆరోగ్య పర్యవేక్షకులు,ఆరోగ్య అధ్యాపకులు,ఆరోగ్య విస్తరణ అధికారులు,పబ్లిక్ హెల్త్ నర్సింగ్అధికారులు,ఆప్తాల్మిక్అధికారులు,మంత్రిత్వ శాఖ సిబ్బంది,ల్యాబ్టెక్నీషియన్లు,నర్సింగ్ అధికారులు317 జీవో బాధ్యులందరూ అధిక సంఖ్యలో హాజరుకావాలని317 GO. రాష్ట్ర వైద్య & ఆరోగ్య రాష్ట్ర బాధితుల JAC,అధ్యక్షుడు - రాపోలు శేఖర్,జి. కార్యదర్శి- కిరణ్ రాథోడ్ ఉపాధ్యక్షుడు - ఎస్.హరి శంకర్, ఆలూరి మంజుల, పావడ్డి రవికిరణ్, ప్రవీణ్ కుమార్ పనస, ఇందిరా కరిసె,వర్కింగ్ ప్రెసిడెంట్ - నెల్లి విద్యా సాగర్,జాయింట్ సెక్రటరీ - సలావుద్దీన్.కన్వీనర్ - నాగనబీన రవి, జోన్ సెకండ్ అధ్యక్షురాలు బొద్దుల పద్మ,ఎగ్జిక్యూటివ్ మెంబర్ - వి. శిరీష కవిత దేవిక జయ శ్రీలు అన్నారు. చలో గాంధీభవన్ పోస్టర్లను రిమ్స్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్ వద్ద విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 317 ను సమీక్షించి బాధ్యత ఉద్యోగ ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కమిటీ పేరుతో మంత్రివర్గం ఉప సంఘం పేరుతో కాలయాపన చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46 జీవో నెంబర్ 317 పై కాంగ్రెస్ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిందని అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జీవోపై చర్చలే జరుగుతున్నాయి తప్ప సమస్య ఒక కొలిక్కి రాలేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 317 బాధితులకు వెంటనే బదిలీలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.