విశ్రాంత డిజిపి మాలకొండయ్య కు మాతృవియోగం
విశ్రాంత డిజిపి మాలకొండయ్యకు మాతృ వియోగం
– ముగిసిన అంత్యక్రియలు
గుంటూరు, అక్టోబర్ 8: విశ్రాంత డిజిపి, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.మాలకొండయ్య మాతృమూర్తి, ప్రకాశం జిల్లా వాసి శ్రీమతి రుక్మిణమ్మ (92) మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం పరమపదించారు. ఆమెకు కుమారుడు మాలకొండయ్య, ఓ కుమార్తె సంతానం. మంగళవారం ఉదయం గుంటూరు కొరిటెపాడు మహాప్రస్థానంలో రుక్మిణమ్మ భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, పోలీసు శాఖ విశ్రాంత ఉన్నతాధికారులు మేకా రమేష్ కుమార్, మధుసూదనరావు, తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాలకొండయ్యను పరామర్శించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పలువురు ఫోన్ ద్వారా మాలకొండయ్యను పరామర్శించారు.