Sports & Games

Breaking News

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు చలో హైదరాబాద్

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

- AITUC కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

NHMలో కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున 17541 మంది ఉద్యోగులు 78 రకాల క్యాడర్లలో పనిచేస్తున్నారని వీరందరినీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అప్పటివరకు  క్యాడర్ ఫిక్సేషన్, రెగ్యులర్ ఉద్యోగుల యొక్క మూల వేతనం అనగా బేసిక్ పే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న పి.ఆర్.సి బకాయిలు వెంటనే చెల్లించాలని AITUC ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు, మంగళవారం రోజున రెబ్బెన పిహెచ్సి లోని డాక్టర్  మోహన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ఈ క్యాడర్లను ఏర్పాటు చేయడం జరిగినది కావున వీరికి పనికి తగిన క్యాడర్ ఫిక్స్ చేసి ఆ క్యాడర్కు సమానమైన బేసిక్ వేతనాన్ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉద్యోగికి మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులందరికి వర్తించే విధంగా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. మహిళా ఉద్యోగస్తులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి, ప్రతి నెల 1వ తేదీన వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. NHMలో కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంపుదల గురించి కమిటి వేసారు సమస్యలు పరిష్కరించుతామని చెప్పారు కాని కాంగ్రేస్ ప్రభుత్వం ఎర్పడి 10 నెలలు అవుతుంది ఇంత వరకు ఉ ద్యోగులపై ద్యాసే లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుంది. కావున ఉద్యోగులను రేగ్యులరైజెషన్ చేయాలని చాలా సార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగింది
గత పి.ఆర్.సి. సందర్భంగా ఇవ్వవలసిన 7 నెలల పి.ఆర్.సి. బకాయిలు వెంటనే విడుదల చేయాలి.
పై సమస్యలు పరిష్కరించని కారణంగా గతంలో అనేక మార్లు విజ్ఞప్తులు చేసిన పలితం రానందున నిరసనగా ఈ నెల 16వ తేదిన  హైదరాబాద్ ఎన్.హెచ్.ఎమ్ రాష్ట్ర డైరెక్టరేట్ కార్యాలయం ముందట మహాధర్నా నిర్వహించాలని మా యూనియన్ నిర్ణయించింది. కావున తమరు సహృదయముతో అలకించి మా సమస్యలు పరిష్కారానికిఅన్నారు, జిల్లాలో NHM ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో NHM సిబ్బంది 2వ ANMలు ప్రమీల,పద్మ,సునీత, విజయలక్ష్మి, తులసి,వనిత,శ్రీవిద్య, రుచిత,మృదుల్ మాండల్ తదితరులు పాల్గొన్నారు...