Sports & Games

Breaking News

16నా వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

- నీ ఇష్టం హెల్త్ మిషన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 
- ఉద్యోగుల పని భారాన్ని తగ్గించాలి 
- జనాభా ప్రాతిపాదికన పోస్టులను పెంచాలి 
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్న
తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి):
 ఈ నెల 16 అక్టోబర్ ఉదయం 11 గంటలకు  హైదరాబాద్ డైరెక్టరేట్ ఎన్.హెచ్.ఎం రాష్ట్ర కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించనున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) కు చెందిన ఎన్. హెచ్. ఎం. అల్ క్యాడర్స్ ఉద్యోగులు పాల్గొంటున్నట్లు ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఉద్యోగులను కోరారు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వైద్యులను రెగ్యులర్ చేసిన విధంగానే ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో రోజురోజుకు పని భారం పెరుగుతుందని ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జనాభాకు అనుకూలం ఒక వైద్య పోస్టులతో పాటు అన్ని క్యాడర్ పోస్టులను పెంచి పని భారాన్ని తగ్గించాలని ఆయన కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం ఆల్. క్యాడర్స్ ఉద్యోగులకు క్యాడర్స్ ఫిక్స్ చేసి బేసిక్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ నెంబర్ 510 ప్రకారం 2018 నుంచి 2024
వరకు అల్ క్యాడర్స్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులకు  ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని , ఉద్యోగితోపాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మూలవేతనం చెల్లించాలని, వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలలో ఎస్.హెచ్.ఎం. ఉద్యోగులను క్యాడర్ వైస్ గా విలీనం చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతినెల 1వ తేదీన  ఉద్యోగులకు వేతనాలు ప్రభుత్వం చెల్లించాలని,సంవత్సరానికి  ప్రతి ఒక్కరికి 35 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయాలని, ఎన్ హెచ్ ఎం ఉద్యోగి మరణించినట్లయితే వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని, 65 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి  రిటైర్మెంట్ ప్రకటించి వారికి నెలకు పెన్షన్ 25 వేల రూపాయలు  ఇవ్వాలి, పలు రాష్ట్రాలలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేశారు రెగ్యులరైజేషన్ చేసిన రాష్ట్ర లు హర్యానా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ , మహారాష్ట్ర ఒడిస్సా చేశారు. అదే మాదిరిగా అల్ క్యాడర్ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో  అల్ క్వాడర్స్ ఉద్యోగులను  క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.