సాయి కృప ఒకేషనల్ జూనియర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9 8 4 8 0 2 5 4 5 1 9848289499
అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సాయి కృప ఒకేషనల్ జూనియర్ కళాశాలలో కరస్పాండెంట్ ప్రమోద్ కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను మంగళవారం రోజు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు బోధకులు డ్యాన్సులు చేస్తూ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సాయి కృప ఒకేషనల్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ప్రమోద్ యాదవ్ మాట్లాడుతూ బతకమ్మ పండగ అనేది ఆదిలాబాద్ జిల్లాలో కనీసం 15 రోజులపాటు ఉంటుందని తెలిపారు. బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన మహిళల పండగ అంతేకాదు తెలంగాణ సాంస్కృతికి ప్రతిక అని తెలిపారు. రంగురంగుల పూలతో పికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మలను చుట్టూ మహిళలు చప్పట్లు వేస్తూ బతకమ్మ పాటలు పాడుతారని తెలిపారు. తెలంగాణలో బతుకమ్మను అనేక రకాలుగా పిలుస్తారని కొన్ని ప్రాంతాల్లో బొడ్డెమ్మ అని మరికొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ అని పిలుస్తారు ఈ పండగను ఎంగిలిపూల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అనే పేర్లతో పిలుస్తారని తెలిపారు. తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మ పండగను ఆఖరి రోజు అత్యంత వైభవంగా పండగను నిర్వహిస్తారని తెలిపారు రకరకాల పువ్వులు రంగురంగుల పూలతో బతకమ్మను తయారుచేసి బావి వద్ద పెట్టి సాయంత్రం పండగ కొనసాగిస్తూ చప్పట్లతో పాటలు పాడుతూ ముత్యాలు చేస్తూ నిమర్జనం చేస్తారని తెలిపారు ఈ పండగ ప్రాచుర్యంలోకి వచ్చి దాదాపు 1000 సంవత్సరాల పైన అయిందని ఇంటి దేవతగా తెలుగు మహిళలందరూ ఇస్తారని పేర్కొన్నారు ఈ పండగ వర్షాకాలం చివరిలో శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుందని ఆయన తెలిపారు. బతకమ్మకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైందని ఆయన గుర్తు చేశారు ఉద్యమ సమయంలో ఏ గ్రామంలో ఏ పల్లెలో పట్టణాల్లో ఎక్కడ చూసినా బతుకమ్మతో ఊరేగింపులు బతుకమ్మ పాటలతోనే ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసిన చరిత్ర బతుకమ్మకు ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో లావణ్య, శారద అశ్విని అభిలాష్ సాయి అభి తదితరులు పాల్గొన్నారు.