జీవో నెంబర్ 317 సబ్ కమిటీ రిపోర్ట్ ముఖ్యమంత్రి కి
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9 8 4 8 0 2 5 4 5 1
G.O.317 సబ్ కమిటీ రిపోర్ట్ ముఖ్యమంత్రి కి సమర్పించినందుకు సబ్ కమిటీ మరియు ముఖ్యమంత్రి ధన్యవాదములు...
-- *G.O.317 JAC*
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి):గత సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు గాంధీభవన్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోజు పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ సమక్షంలో గత ప్రభుత్వం ధ్వంసం చేసిన స్థానికతని మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో పునరుద్ధరించి స్థానికత కోల్పోయిన ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామని మాట ఇచ్చిన ప్రకారంగా 317జీవో సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.ఆ 317 జీవో పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గార్లు అనేక సమావేశాలు నిర్వహించి ఈరోజు నివేదికని ముఖ్యమంత్రి గారికి అందజేసిన సందర్భంలో క్యాబినెట్ సబ్ కమిటీకి ముఖ్యమంత్రి గారికి జీఓ317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.
ముఖ్యమంత్రి మాట ఇచ్చిన విధంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో పెట్టిన విధంగా ఈ సబ్ కమిటీ రిపోర్ట్ స్థానికత కోల్పోయిన ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయునికి తన స్థానికతను తిరిగి ఇస్తుందని ఆశిస్తూ త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన గైడ్లైన్స్ వెంటనే విడుదల చేయడానికి ఆదేశాలు ఇస్తారని ఆశిస్తున్నాము.G.O. 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు పాలిటెక్నిక్ వింగ్ ప్రెసిడెంట్ సందీప్, పంచాయతి సెక్రటరీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మెడికల్ డిపార్టుమెంట్ అధ్యక్షులు రాపోలు శేఖర్, మహిళా విభాగ నాయకులు చముందేశ్వరి, వినోద, హారతి, తదితరులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు..