కార్యాలయంలోనీ చాంబర్లు పరిశీలించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ
అదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఏవిభాగంలో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారా అటెండెన్స్ ఎక్కడ పెడుతున్నారు లివులు పెడితే ఎవరికి చెబుతున్నారు విధులకు సరైన సమయానికి వచ్చి పోతున్నారా లేదా అనే విషయాలపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ ఆరా తీశారు. మొదటి అంతస్తు నుంచి మూడవ అంతస్తు వరకు ఏ అంతస్తులు ఏ శాఖ అధికారులు ఉన్నారు. సిబ్బంది ఎవరెవరున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ఏ అంతస్తులు ఉన్నారు వాళ్ళ ఛాంబర్లీ ఎక్కడ అని అడిగి తెలుసుకున్నారు. విభాగాల్లో ఉన్న సిబ్బందిని మీ ప్రోగ్రామ్స్ ఏమి ఎంతవరకు పూర్తి చేశారు... మీ ప్రోగ్రామ్స్ ఎంతమంది పాజిటివ్ కేసులు ఉన్నాయి... ఎన్ని నెగిటివ్ కేసులు ఉన్నాయి. మీరు ఏ విధంగా వాళ్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని లెప్రసీ విభాగంలో అడిగి తెలుసుకున్నారు. ముందులో ఉన్న కంప్యూటర్ గదిలోకి వెళ్లి ఎంతమంది పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు అని అడిగారు. మాస్ మీడియా విభాగానికి వెళ్లి మాస్ మీడియాలో ఎంత మంది పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న మాస్ మీడియా అధికారిని లీవ్ పెట్టి వెళ్లాలని అక్కడ ఉన్న వెంకటరెడ్డి ఇంచార్జ్ మాస్ మీడియా అధికారికి తెలిపారు. ఎయిడ్స్ విభాగంలో ఎంతమంది పనిచేస్తున్నారు. కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఉద్యోగుల రిజిస్టర్ను పరిశీలించారు ఎక్కడ ఉన్న అధికారి ఏ విధంగా పనిచేస్తున్నారు. రెండవ తేదీన ఒక కార్యక్రమం ఉంది దాని గురించి నాకు ఎందుకు చెప్పలేదని అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ విషయమైనా సంబంధిత ప్రోగ్రాం అధికారి దృష్టికి తీసుకుపోవాలని ఉద్యోగులందరికీ సూచించారు ప్రోగ్రాం ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తే వారు తన దృష్టికి తీసుకు వస్తారని తెలిపారు. లీవ్ లు పెట్టినా తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. సిబ్బంది ఏ విభాగాల్లో ఎక్కువగా ఉన్నారు ఏ విభాగాల్లో తక్కువగా ఉన్నారు. పరిశీలించి లేని విభాగాల్లో సిబ్బందిని వేయాలని తెలిపారు. అటెండర్లు ఎంతమంది ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. దీంతో ఎన్సిడి విభాగంలో అటెండర్లు లేరని ఒక అటెండర్ని ఇవ్వాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్ తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి ఒక అటెండర్ ని పంపించాలని సూపరిండెంట్ గోపి కితెలిపారు.వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి మరియు ఎన్సీడీ ప్రాజెక్టు అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్, జిల్లా ఎయిడ్స్ మరియు లేప్రసి నివారణ అధికారి డాక్టర్ గజానంద్, కార్యాలయ సూపరిండెంట్ గోపి, గణాంకల అధికారి బ్రహ్మానందం రెడ్డి , నేషనల్ హెల్త్ మెషిన్ జిల్లా అధికారి అనిల్ తదితరులు ఉన్నారు.