Sports & Games

Breaking News

వైద్య సేవలు అందించడంలో ముందుండాలి - రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్

ఆదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ వైద్య సేవలు అందించడంలో వైద్యులు మరియు వైద్య సిబ్బంది ముందుండాలని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. శనివారం రోజు ఆయన ఓపి విభాగంలోని అన్ని వార్డులను సందర్శించారు. వైద్యులు ఎలా పనిచేస్తున్నారు, వైద్య సిబ్బంది మెడికల్ మెడికల్ సిబ్బంది రోగులకు ఎలా వైద్య సేవ అందిస్తున్నారని ఆరా తీశారు. అన్ని వార్డులు తిరుగుతూ ఉండాలని ఆర్ ఎం ఓ డాక్టర్  చెందుకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్సిడి క్యాబిన్ వద్దకు వెళ్లి క్యాబిన్ ను శుభ్రం చేసుకోవాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. గైనకాలజీ విభాగంలోకి వెళ్లి వేగవంతంగా సేవలందించలని ప్రొఫెసర్ కు తెలిపారు. జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్ తో పాటు దళితర ఓపి విభాగాలను ఆయన పరిశీలించారు. అనంతరం ల్యాబ్ లోకి వెళ్లి రక్తం మూణాలు ఎలా సేకరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రక్తం నమూనాలు స్వీకరించే వద్ద కేవలం ట్రైనింగ్ పిల్లలే ఉన్నారని సీనియర్లు మీరు వెళ్లి అక్కడే ఉండి రక్త నమూనాల సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనాపటికి వైద్యం కోసం వచ్చే ఫిదా బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య సేవ అందించడంలో వైద్యులు మరియు వైద్య సిబ్బంది ముందు ఉండాలని తెలిపారు. డైరెక్టర్ వెంట సిసిలు, అశ్విన్ కుమార్, రవీందర్ తదితరులు ఉన్నారు.