జైనథ్ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన మహిళా కమీషన్ చైర్ పర్సన్
ఆదిలాబాద్ : రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద జైనథ్ మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రఖ్యాత లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్ఛకులు కమిటి సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆత్రం సుగుణ ,కుమ్ర ఈశ్వరీ బాయి , కంది మౌన శ్రీనివాస రెడ్డి, బోథ్ అసెంబ్లీ ఇంఛార్జి ఆడె గజేందర్ ,జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, రుకేష్ రెడ్డి , జగదీష్ రెడ్డి తదితరులున్నారు

