Sports & Games

Breaking News

.ట్రైబల్ ఏరియాల్లోని గర్భిణులను వారం ముందే షిఫ్ట్ చేయాలి

• ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ క్యాలెండర్ మెయింటెన్ చేయాలి

• హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా

తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి):: ట్రైబల్ ఏరియాల్లోని గర్భిణులను ఎస్టిమే టెడ్ డెలివరీ డేట్ (ఈడీడీ) కంటే వారం ముందే ప్రభుత్వాస్పత్రు లకు తరలించాలని మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. శనివారం సచివా లయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. ట్రైబల్ ఏరియాల్లో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని, సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అంబులెన్సుల సంఖ్యను పెంచాలన్నారు. నాలుగు ఐటీడీ ఏల పరిధిలో వెంటనే ఈ రూల్ ను ఇంప్లిమెంట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక ప్రభుత్వం నియ మించిన టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం అప్రమ త్తంగా ఉంటూ ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో నిత్యం తనిఖీలు జరపాలని సూచించారు. ప్రతి నెల తనకు రిపోర్టును అందజేయాలన్నారు. దీంతో పాటు ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కూడా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిట ళ్లలోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదే శించారు. ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల హెచ్వోడీలు నెలకు కనీసం రెండుసార్లు జిల్లాల్లోని హాస్పిటల్స్ ను విజిట్ చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటల్ హెచ్ఎర్, అటెండెన్స్, ఎక్విప్మెంట్, మెడిసిన్, సానిటే షన్, డైట్ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖాన్లలో బయో మెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని, డ్యూటీ హవర్స్ లో డాక్టర్లు, సిబ్బంది తప్పకుండా హాస్పిటల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో