Sports & Games

Breaking News

ఘనంగా రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ చరణ్ గౌడ్ జన్మదిన వేడుకలు

ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా యువజన సంఘాల సమితి జిల్లా ముఖ్య సలహాదారులు రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ ఆక్టోపాసిటీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా యువజన సంఘాల ఆధ్వర్యంలో చరణ్ గౌడ్ నివాసంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. చరణ్ గౌడ్కు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. తన పుట్టినరోజు వేడుకలను యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని చరణ్ గౌడ్ తెలిపారు. తన పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. చరణ్ గౌడ్ పుట్టినరోజు కార్యక్రమంలో యువజన సంఘాల సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు గన్నోజి విజయ్ కుమార్, దొంతుల ప్రవీణ్, సామ రూపేష్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, బాల శంకర్ కృష్ణ తో పాటు తదితరులు పాల్గొన్నారు.