Sports & Games

Breaking News

వాగు అడవి దాటి వైద్య సేవలు

.ఇంద్రవెల్లి (ఆరోగ్యజ్యోతి): ఇంద్రవెల్లి మండలంలోని పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గోపాలపురం గూడాలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిట్ట బొంగరం నుంచి అడవిలో కాలినాడకన వెళ్లొద్దు వాగులు వంకలు దాటుతూ ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ పూజిత హెచ్ఈఓ గోకుల్ ఆరోగ్య కార్యకర్త విజయ సుందరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో డ్రైడే కార్యక్రమం తో పాటు మాతా శిశు సంరక్షణ వ్యాధులపై అవగాహనతో పాటు వైద్య శిబిరాన్ని నిర్వహించి పలువురికి వైద్య సేవలను అందించారు. వర్షాకాలం కావడం వల్ల ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇంటింటి తిరుగుతూ వైద్య సేవలు అందించడంతోపాటు పాఠశాలల పిల్లలకు కూడా వైద్య సేవలు అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేస్తూ మందులను పంపిణీ చేశారు.