ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
అదిలాబాద్,( ఆరోగ్యజ్యోతి): మనిషి జీవితం ఎంతో ముఖ్యమైనదని భగవంతుడు మనకు జన్మనిచ్చాడని ఆ జన్మని మనం వినియోగించుకోవాలని ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దని ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయని దాన్ని ఆలోచించి పరిష్కరించుకోవాలని తెలిపారు. మానసికంగా ఇబ్బందులు పడ్డవారు ఆత్మహత్యలు చేసుకోవద్దని 14416 అనే టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి వారికి ఉన్న సమస్యలను మానేసిక ఇబ్బందులను తెలియజేయాలని తెలిపారు. ఈ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే వైద్యుల కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాణాలను కాపాడతారని అందుకు కుటుంబ సభ్యులు ఈ నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వారి కుటుంబ సభ్యులు ఈ నెంబర్కు ఫోన్ చేసి సలహాలు సూచనలు పొందాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వారు సైక్రియాటిస్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ ఓం ప్రకాష్, సైకాలజిస్ట్ శ్రీకాంత్,ఎన్ సి డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త చిరంజీవి, సూపర్వైజర్ కుర్షిధ్ తదితరులు పాల్గొన్నారు.