633 ఫార్మసీ పోస్టులకు నోటిఫికేషన్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
.- డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో 446
- వైద్య విధాన పరిషత్ పరిధిలో 185
- ఎం.ఎన్.జే లో 2
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ లో కీలక పోస్టులన్నిటిని భర్తీ చేయడంతో పాటు మెడికల్ పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు దృష్టి సాధించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దామోదర రాజనర్సింహ మొదటి సంతకం స్టాప్ నర్సుల కు నియామక పత్రాలపై సంతకం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఖాళీగా ఉన్న పోస్టుల ప్రభుత్వం దృష్టి సాధించింది. తెలంగాణలో ఏ శాఖలో లేని విధంగా వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికి వేలాది పోషం కు నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో 446 తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 185, ఎంఎన్జే పరిధిలో రెండు ఫార్మసిస్ట్ పోస్టులకు గాను ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. మొన్న ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్స్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.