Sports & Games

Breaking News

30 ఏళ్ల ముందే గుండెజబ్బుల గుర్తింపు!

.30 ఏళ్ల ముందే గుండెజబ్బుల గుర్తింపు!

ఎల్డీఎల్తో పాటు సీ రియాక్టివ్ ప్రోటీన్, లిపో ప్రోటీన్ల ద్వారా వెల్లడి 30 వేల మంది మహిళలపై 1992-95లో జరిగిన అధ్యయనంపై సరికొత్త విశ్లేషణ 'యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్'లో పరిశోధన పత్రం

లండన్: సాధారణంగా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి గుండెజబ్బు ప్రమాదాన్ని అంచనా వేస్తుంటారు. మరీ ముఖ్యంగా, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)పై దృష్టి పెడతారు. అయితే, రక్తపరీక్షను కొలె స్ట్రాల్ మోతాదు చూడటానికే పరిమితం చేయటం వల్ల.. గుండె జబ్బు ప్రమాదాన్ని సూచించే ఇతర కారకాల పట్ల నిర్లక్ష్యం వహించినట్లయ్యిందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎల్డీఎల్డీతోపాటు, రక్తంలో ఉండే లిపో ప్రోటీన్ అనే కొవ్వు గురించి, మంట పుట్టించే సీ రియాక్టివ్ ప్రోటీన్ల గురించి తెలుసుకోవటం ద్వారా. 30 ఏళ్ల వ్యవధిలో వచ్చే గుండెజబ్బులను కూడా ముందుగానే తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టవచ్చని ఈ అధ్య యనం తెలియజేసింది. 'న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో దీని వివ రాలు ప్రచురితమయ్యాయి. అమెరికాలోని సెంటర్ ఫర్ కార్డియో వాస్క్యు లార్ డిసీజ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ పాల్ రిడ్కర్ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన జరిపింది. దీంట్లో భాగంగా 'విమెన్స్ హెల్త్ స్టడీ'లో భాగమైన దాదాపు 30వేల మంది అమెరికా మహిళల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. 1992-95 మధ్య జరిగిన ఈ స్టడీలో చేరినప్పుడు ఈ మహిళల సగటు వయస్సు 55 ఏళ్లు. ఆ తర్వాత 30 ఏళ్లలో వీరిలో దాదాపు 13% మంది (3,600 మంది) గుండెపోటు/ బ్రెయిన్ కు గురయ్యారు. స్టడీలో భాగం కావటానికి ముందు మహిళలందరికీ అప్పట్లో రక్త పరీక్ష జరిపారు. ప్రస్తుతం పాల్ రిడ్కర్ బృందం.. ఈ రక్తపరీక్ష ఫలితాలను అధ్యయనం చేసి, గత 30 ఏళ్లలో ఆ మహిళలు ఎదుర్కొన్న గుండెజబ్బులకు, వారి రక్తప రీక్ష ఫలితాలకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది. దీని ప్రకారం.. ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న వారితో పోల్చితే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అత్య ధికస్థాయిల్లో ఉన్న వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 36% అధికం. ఇదే విధంగా, లిపో ప్రోటీన్ (ఎల్పీ-ఏ) ఎక్కువగా ఉన్న వారిలో ఈ ప్రమాదం 33% ఎక్కువ. సీ రియాక్టివ్ ప్రోటీన్లు (సీఆర్పీ) అత్యధికంగా ఉన్న వారిలో గుండె జబ్బుల ప్రమాదం 70% ఎక్కువని వెల్లడైంది. ఇక మీదట రక్తపరీక్షలో ఎల్డీఎల్డీతోపాటు, లిపో ప్రోటీన్, సీ రియాక్టివ్ ప్రోటీన్ల మోతాదును కూడా తప్పకుండా పరిశీలించాలని, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే తెలుసుకోవచ్చని డాక్టర్ పాల్ రిడ్కర్ సూచించారు. శనివారం లండన్లో జరిగిన 'యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్-2024'లో ఈ పరిశోధన పత్రాన్ని సమర్పించారు.