గాదిగూడ, (ఆరోగ్య జ్యోతి): గాదిగూడ మండలంలోని జరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అర్జుని, మారుగూడ అనుబంధ గ్రామాల్లో వైద్య సేవలు అందించారు. ప్రవహించే వాగుతో ప్రాణాలకు తెగించి హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్ ఆరోగ్య కార్యకర్త సులోచన ఆశ కార్యకర్త సురేఖ ల ఆధ్వర్యంలో వైద్య సేవలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సేవంత శార్దాబాయి లో హాజరయ్యారు. గర్భిణీలకు వైద్య పరీక్షలు సీజనల్ వ్యాధులపై అవగాహన వ్యాధినికృతక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించి ఉచిత వైద్య అందించారు వర్షాకాలం వచ్చే వ్యాధులపై హెల్త్ ఎడ్యుకేటర్ రవీందర్ ఆరోగ్య కార్యకర్త సులోచనలు ప్రజలకు అవగాహన కల్పించారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం పరుచుకోవాలని మన భుజించే సమయంలో చేతులను శుభ్రపరచుకోవాలని సూచించారు ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నీటిని విలువలు ఉండకుండా చూడాలని తెలిపారు. నీటి నిల్వలు ఉన్నట్లయితే ఈగలు దోమలు వచ్చి డెంగ్యూ మలేరియా అతిసార పచ్చకామర్ల లాంటి వ్యాధులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిసరాల పరిశుభ్రం తోనే వ్యాధులు దూరమవుతాయని తెలిపారు.
వాగు దాటుతూ వైద్య సేవలు
Reviewed by arogyajyothi daily
on
August 15, 2024
Rating: 5