Sports & Games

Breaking News

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు కమిటీ

.హైదరాబాద్: ఉద్యోగుల సాధారణ బదిలీలప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా వైద్య, ఆరోగ్యశా ఖలో ఏడు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆ శాఖ కార్య దర్శి క్రిస్టినా జడ్ చోంగూ ఉత్తర్వులు జారీ చేశారు. కేడర్, సబ్ కేడర్ లు సహా వేర్వేరు ప్రత్యేకతలున్న నేప థ్యంలో కమిటీలు ఆయా విభాగాల్లో బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, వైద్యవిద్య డైరెక్టర్, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ఆయుష్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) విభాగాల కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిష నర్ల నేతృత్వంలో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. బదిలీలపై ఆర్థికశాఖ ఈ నెల 3న జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు.

245 మందికి పదోన్నతులు

బోధనాసుపత్రుల్లోని 245 మంది అసిస్టెంట్ ప్రొఫె సర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిం చారు. ఈ మేరకు ఆదివారం వైద్యవిద్య డైరెక్టర్ ఎన్. వాణి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అసోసి యేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులిచ్చేందుకు డీపీసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బోధనాసుప త్రుల్లో ఏడు విభాగాలకు సంబంధించి డీపీసీ సమావే శాలు పూర్తికాగా 56 మంది ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. మరో 14 విభాగాలకు సంబంధించి డీపీసీ సమావేశం సోమవారం జరగనుంది.