రిమ్స్ డైరెక్టర్ ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం
అదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): కలోజి నారాయణ హెల్త్ యూనివర్సిటీ సేనేటర్గా నియమించితులైన రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ ని ఐఎన్టీయూసీ ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కాలోజి నారాయణ హెల్త్ యూనివర్సిటీ కి ఆదిలాబాద్ జిల్లా నుంచి రిమ్స్ డైరెక్టర్ ప్రత్యేక కమిటీ సభ్యులుగా ప్రభుత్వం నియమించినందుకు గాను వారు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు మరెన్నో తీసుకోవాలని ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డి సత్యనారాయణ, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్ కృయా శీల సభ్యులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు