Sports & Games

Breaking News

మానవత్వాన్ని చాటుకున్న సాక్షి ఫోటోగ్రాఫర్

*మానవత్వాన్ని చాటుకున్న సాక్షి ఫోటోగ్రాఫర్ అరుణ్ రెడ్డి....*

ఆదిలాబాద్ (ఆరోగ్య జ్యోతి): పురికి నొప్పులతోబాధపడుతూ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వచ్చిన బేల మండలం *సదల్ పూర్ గ్రామానికి* చెందిన ఆదివాసి మహిళ అయినటువంటి *కోడప సుమన్ బాయి* రక్తహీనతతో బాధపడుతున్న విషయం వైద్యులు  తెలుసుకున్నారు.ఆమెకు ప్రసవం జరగాలంటే *ఏ పాజిటివ్* రక్తం అవసరమని కుటుంబ సభ్యులకు సూచించారు.దీంతో కుటుంబ సభ్యులు స్థానికుల ద్వారా *యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి* ని సంప్రదించి తమకు అత్యవసరం *ఏ పాజిటివ్ రక్తం* కావాలని కోరారు.దీనికి వెంటనే స్పందించిన సామ రూపేష్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సాక్షి దినపత్రిక ఫోటోగ్రాఫర్ చింతల అరుణ్ రెడ్డి ని సంప్రదించగా ఆయన మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి బాధితురాలికి అవసరమైన *ఏ పాజిటివ్* రక్తాన్ని అందజేశారు.ఆమె పరిస్థితి మెరుగు కావడంతో వైద్యులు వైద్యం చేయగా మహిళా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు సామ రూపేష్ రెడ్డికి, చింతల అరుణ్ రెడ్డికి కుటుంబ సభ్యులు కోడప వాగు కృతజ్ఞతలు తెలుపగా వీరిని వైద్యులుఅభినందించారు.ఆయనతో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు తదితరులు ఉన్నారు.