Sports & Games

Breaking News

ఆర్.ఎం.పి ఎంపీలు నిబంధన మేరకే ప్రాక్టీస్ చేయాలి

ఆర్.ఎం.పి పిఎంపీలు నిబంధనల మేరకే ప్రాక్టీస్ చేయాలి 
- నిబంధనలో దాటిన వారిపై చర్యలు తప్పవు
- త్వరలో జిల్లాలోని ఆర్ఎంపీ పిఎంపి వైద్యులతో సమావేశం
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
అదిలాబాద్ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపి), ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పి.ఎం.పి) లు ప్రభుత్వ నిబంధనల మేరకే  ప్రాక్టీస్ చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రాక్టీస్ చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చాలామంది వైద్యులు వారి వారి క్లినిక్లలో బెడ్లు ఏర్పాటు చేయడం రక్తపరీక్షలు చేయడం లాంటివి జరుపుతున్నారని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా స్పెషలిస్టుల పేర్లతో బోర్డులు తయారు చేసుకొని పెట్టుకుంటున్నారని వీరందరూ నిబంధన మేరకు లిమికులు నడుపుకోవాలని లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొంతమంది వైద్యులు అవసరం ఉన్నా లేకున్నా ఐ వీలు పెట్టడం యాంటీబయటిక్ లాంటి మందులు రాయడం జరుగుతుందని వారందరూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గ్రామీణ స్థాయిలో వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చికిత్సలు మాత్రమే అందించాలని కానీ చాలామంది వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా క్లినికులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. త్వరలో టీం లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పిస్క్రిప్షన్ లో మందులు రాయటం యాంటీబయటిక్ లాంటి మందులు రాయడం, ఐ విలుపెట్టడం లాంటివి చేయకూడదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరి ఇతర ప్రాంతాల్లో ఆర్.ఎం.పి మరియు పి.ఎం.పి వైద్యులందరూ ఇకనైనా నియమ నిబంధనలు పాటిస్తూ వైద్యం చేయాలని ఆయన పేర్కొన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపి మరియు పి.ఎం.పి వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి నియమ నిబంధనలన్ని ప్రకటిస్తామని తెలిపారు. నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.ఇకనైనా ఆర్.ఎం.పి ఎంపీ వైద్యులు నిబంధనల మేరకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ హెచ్చరించారు.