వైద్య ఆరోగ్య శాఖలో, పనిచేస్తున్న ఫార్మసిస్టుల హోదాను ప్రభుత్వం ఫార్మసీ ఆఫీసర్స్ గా మార్చింది ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది .వైద్య, విద్య, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్ లలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ గ్రేడ్-1 ఉద్యోగులకు "ఫార్మసీ ఆఫీసర్స్" గా, ఫార్మసీ సూపర్వైజర్లను "చీఫ్ ఫార్మసీ ఆఫీసర్లు "గా మార్చింది. దీని పైన ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ తేజవాత్, ఉపాధ్యక్షులు డాక్టర్ జ్యోతి శ్రీ, M.A అలీమ్, జనరల్ సెక్రెటరీ, ప్రశాంత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాంబాబు, స్టేట్ ఇంచార్జ్ నరసింహ, సీనియర్ అసోసియేట్, సుమన్ ,చిలకన్న, అందె కిరణ్ కుమార్, బానోత్ రామారావు, సిహెచ్ తిరుమల్ రావు, మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ జీవో ను విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారికి, IPA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివ కుమార్ తేజావత్ గారికి, పలువురు ఫార్మసిస్టులు కృతజ్ఞతలు తెలిపారు...