పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తీరు ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచింది.ఆయన భార్య విజయ నిన్న గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రసవించారు.రాత్రి పురిటినొప్పులు రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.తన భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు.దీంతో ఈ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి..