ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరీక్షణ ఇంకా ఎన్నాళ్లు?..
• కలగానే 'ఎన్హెచ్ఎం’ కొలువుల క్రమబద్ధీకరణ*
• రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు, సిబ్బంది ఎదురుచూపులు..
- జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఏఐటియుసి అనుబంధం
• కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుంది ప్రభుత్వమైనా చొరవ చూపాలని విజ్ఞప్తి
• తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్
తెలంగాణ బ్యూరో (ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో 2000లో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది నియమించింది. నాటి నుంచి ఉద్యోగులు అరకొర వేతనాలతోనే కుటుంబాలను పోషిస్తున్నారు. పిల్లలను చది వించుకుంటున్నారు. రెండు దశబ్దాలుగా భారంగా బతుకుబండిని లాగుతున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొలువులును క్రమబద్ధీకరిస్తామని నేతలు వాగ్దానాలు చేస్తున్నారే తప్ప వాటిని ఆచరణలో చూపడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కొలువుల క్రమబద్ధీకరణ కాకపోగా, జాతీయ ఆరోగ్య మిషన్ ఏడు నెలల పీఆర్సీ ఏరియర్స్ సంబంధించిన నిధులు నిలిచిపోయాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17,541 మంది ఉన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలు అవుతుంది ప్రభుత్వమైనా తమ ఆవేదనను ఆలకించి కొలువులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
పల్లెల్లోనూ సేవలు..
వైద్యారోగ్యశాఖ పరిధిలోని ఎన్హెచ్ఎం ఉద్యోగులు నగరాలు, పట్టణాలే కాదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు వైద్యసేవ లు అందిస్తున్నారు. రేయింబవళ్లు వీరి సేవ లను వినియోగించుకుంటున్న ప్రభుత్వాలు వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు మాత్రం ముందుకురావడం లేదు. వీరు సమస్యలు పరిష్కరించాలి.ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న అన్ని కేడర్ల వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలి. ఉద్యోగులకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 510 ద్వారా కొన్ని క్యాడార్స్ ఉద్యోగులకే మేలు జరిగింది. మిగతా వారంతా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం 510 జీవోను అందరికీ వర్తింపజేయాలి. సమాన పనికి సమాన వేతనం అందించాలి. రెగ్యులర్
ఉద్యోగులతో పాటు మాకూ జీతభత్యాలు (బేసిక్ పే) చెల్లించాలి. హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా చేయాలి, మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఈ.ఎస్.ఐ పీ.ఎఫ్. సౌకర్యం ప్రతి ఒక్క ఉద్యోగికి కల్పించాలి. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు మాత్రం పర్మినెంట్ ఉద్యోగుల వేతనాల్లో సగమం కూడా ఉండడం లేదు. తమ కొలువులను
క్రమబద్ధీకరించాలని రెండు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నామని, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టా మని, అయినా ఫలితం లేకపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు.
వివిధ కేటగిరీల్లో..
జాతీయ ఆరోగ్య మిషన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు వీరికి 510 ప్రకారం జీతాలు పెంచని వారి లిస్ట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. అర్బన్ హెల్త్ సెంటర్లలో పీ.హెచ్.ఎం./ సీ.ఓ, అకౌంటెంట్లు,సపోర్టింగ్ స్టాఫ్, మెడికల్ ఆసిస్టెంట్లు (ఆర్) ఎం.ఎన్.ఎం, వాచ్ మెన్, స్వీపర్ , ఎన్.ఆర్ సి. కౌన్సిలర్స్ , ఎన్ ఆర్ సి కుక్స్, ఆర్ కె ఎస్ కె కౌన్సిలర్స్, బ్లాక్ లెవెల్ అకౌంటెంట్స్ , బ్లడ్ బ్యాంక్ డీ.ఈ.వో, ల్యాబ్ అటెండర్, ఆరోగ్య మహిళ డీ.ఈ.వో, డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్, డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కమ్యూనిటీ మొబిలైజర్, పల్లె దావఖన వైద్యాధికారులు, ఎస్.ఎన్.సి.యూ.డీ.ఈ.వో, సెక్యూరిటీ గార్డులు, ఓ.టీ టెక్నీషియన్, టీ-హబ్ మేనేజర్, ఫిజియోథెరపిస్ట్, ఎన్.సి.డి కౌన్సిలర్, టీ హబ్ -రేడియోగ్రఫీ, టీ హబ్ సపోర్టింగ్ స్టాప్, టీ హబ్ డీ.ఈ.వో, ఎం.సి.హెచ్ సపోర్టింగ్ స్టాఫ్, పీ.హెచ్.సి.డీ.ఈ.వో, కాంటిజెంట్ వర్కర్లు, డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో డెంటల్ టెక్నీషియన్, సోషల్ వర్కర్, ఆడియాలజిస్ట్ , స్పెషల్ ఎడ్యుకేటర్, సైకాలజిస్ట్, ఎం.సీ.హెచ్.ఓ.టీ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డు, సపోర్టింగ్ స్టాఫ్, ఆయుష్ ఎస్.ఎన్.ఓ ,ఎఫ్.ఎన్.ఓ ఎంసీ.హెచ్. సెక్యూరిటీ గార్డులు మరియు, వాచ్మెన్లు,యన్.టి.ఈ.పి లో ఎస్ .టి .ఎల్. ఎస్, ఎల్.టీ. సూపర్వైజర్స్, ఎస్.టి.ఎస్. ,టి.బి.హెచ్.వి.,డి.ఈ.ఓ,.డి.పి.ఎస్.,డి.పి.పీ.ఎం,డీ.పీ.సీ.,సూపర్వైజర్లతోపాటు పలు కేటగిరీలకు చెందిన వారు పనిచేస్తున్నారు.