*ఎం.జీ.ఎం.(పి.పీ.యూనిట్) ను అకస్మిక తనిఖీ చేసిన వరంగల్ డీ.ఎం.అండ్.హెచ్ ఓ. డాక్టర్. సాంబశివరావు.*
*వరంగల్ జిల్లా*
*20 మే 2025*
వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీ.పీ.యూనిట్)ను పరిశీలించిన వరంగల్ డీ. ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.బీ. సాంబశివరావు. పీపీ యూనిట్ వెల్ బేబీ లో నిర్వహించే వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాలు నిల్వ చేసే కోల్డ్ చైన్ సిస్టంను పరిశీలించి,రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా డి.ఎం.అండ్.హెచ్.ఓ. సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పట్టణంలో పర్యటించినప్పుడు పరిసర ప్రాంతాలను పరిశీలించాలని, వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలి, జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.మోహన్ సింగ్ , ఎం.జీ.ఎం. పీ.పీ. యూనిట్ వైద్యాధికారి డాక్టర్.ఏం.యశస్విని, హెచ్. ఈ.ఓ. విద్యాసాగర్, సూపర్వైజర్ నర్మద, ఈవిన్ మేనేజర్ రవీందర్, నర్సింగ్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, రామ రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.