- రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రతి ఒక్కరికి వైద్య సేవలు
- అందుబాటులోకి అన్ని రకాల వైద్య సేవలు
- ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలి
- డైరెక్టర్ డాక్టర్ జయ సింగ్ రాథోడ్
ఆదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చిన్నారులకు అరుదైన శాస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. శనివారం నాడు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఓ చిన్నారికి అరుదైన శాస్త్ర చికిత్స నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ శాస్త్ర చికిత్స ఇతర ప్రాంతాల్లో చేస్తే రెండు లక్షల పైగా ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు చిన్నారులకు చాలా రకాల శాస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కిడ్నీ గ్యాస్ క్యాన్సర్ న్యూరో సర్జరీ తోపాటు అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు రిమ్స్ లో ఉన్నవని డైరెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు యవత్మాల్ నాగపూర్ హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుతున్న సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ తెలిపారు. అనంతరం పిల్లల శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ దేవిదాస్ సామల మాట్లాడుతూ పిల్లల్లో రకరకాల శాస్త్ర చికిత్సలు ఉంటాయని తెలిపారు. శాస్త్ర చికిత్స అనేది శరీరంలోని ఏ భాగానికైనా ఎప్పుడైనా అవసరం అవ్వచ్చని తెలిపారు ఇప్పటివరకు రిమ్స్ ఆస్పత్రిలో పిల్లలకు చాలా రకాల శాస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పిల్లల వైద్యులు వేరని పిల్లల శాస్త్ర చికిత్స వైద్యులు వేరు అని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఏర్పడినప్పటి నుంచి రకరకాల శాస్త్ర చికిత్సలు పిల్లలకు నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. అనంతరం జీర్ణకోశ వైద్య నిపుణులు డాక్టర్. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ జీర్ణకోశానికి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలేయానికి సంబంధించిన అన్ని రకాల జబ్బులు ఉన్నాయం చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా పచ్చ కామెర్లు తుపార్టు జీర్ణాశయానికి వచ్చే రకరకాల జబ్బులను నయం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా అదిలాబాదులో నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్న వైద్య పరికరాలు మరియు వైద్య సేవలు ఇంకా ఎక్కడ లేవని తెలిపారు అందుకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ జీర్ణ కోశానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్సలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్, డాక్టర్ విజయరామరాజు, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఆర్ ఎం ఓ డాక్టర్ సాయి, నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి తదితరులు ఉన్నారు.