వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఫార్మసిస్టుల హెూదాను ఫార్మసి ఆఫీసర్స్ గా మార్చుతూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జి.ఓ. నెంబరు 71 ను 25 ఏప్రిల్ న జారీ చేసింది.
వైద్య, విద్య, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్ లో పని చేస్తున్న ఫార్మసిస్టు గ్రేడ్-II లను ఫార్మసి ఆఫీసర్స్ , ఫార్మసిస్టు గ్రేడ్-I లను సీనియర్ ఫార్మసి ఆఫీసర్స్ గా, ఫార్మసి సూపర్వైజర్లను చీఫ్ ఫార్మసి ఆఫీసర్లుగా మార్పు చేస్తూ జి.ఓ. జారీ చేసింది. ఈ సందర్భముగా తెలంగాణ గవర్నమెంటు ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్, రాష్ట్ర ఫార్మసి కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు ఉప్పు భాస్కర్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. శరత్బాబు లు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసారు.