ఎడిటర్ కె నరేష్ కుమార్, 9848025451, 984828 9499
ఔషదాల కొరత రాకుండా చూసుకోవాలి- టాస్క్ఫోర్స్ అధికారి: బి. ప్రేమకుమార్
జనగాం,(ఆరోగ్య జ్యోతి): జిల్లాలోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందం అధికారి బి.ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్తో తో పాటు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, లింగాల ఘణపురం, రఘునాథపల్లి పి.హెచ్.సి. జనగాం అర్బన్ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్కు వస్తున్న మందులు.. నిలువ చేస్తున్న విధానాలు పంపిణీ ప్రక్రియలో పారదర్శకంగా ఉంటున్నారా.. అనే అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర పారా మెడికల్ బోర్డు సెక్రటరీ టాస్క్ ఫోర్స్ అధికారి బి. ప్రేమ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం టీచింగ్ ఆసుపత్రులకు 568 రకాలు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు 543 రకాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 330 రకాల ఔషదాలను సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ద్వారా ఆసుపత్రులకు సరఫరా చేస్తోందన్నారు. ప్రతి ఆసుపత్రిల్లో ఈ ఔషది తప్పనిసరిగా చేయాలన్నారు. మందుల లెక్కలు పక్కాగా నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇక నుండి తరచూ ఆసుపత్రుల తనిఖీలకు వస్తామని... ఎప్పటికప్పుడు.. ఆసుపత్రుల పని తీరు వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జిల్లా వైధ్యాధికారి, పి.హెచ్.సి.ల వైద్యాధికారులు ఈ ఔషదిలో ఎప్పటికప్పుడు మందుల వివరాలను నమోదు చేయించాలన్నారు. మరో నెల రోజుల్లో మళ్ళీ ఆకస్మిక తనిఖీలకు వస్తామని రికార్డులు సరిగా లేకుండా శాఖాపరమైన చర్యలు తప్పవని చెప్పారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు వైద్యం, మందులు అందించాలన్నారు. టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు డాక్టర్ సయ్యద్ అహ్మద్ లతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కావూరి మల్లికార్జున్రావు, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు ఉమ్మడి జిల్లాల సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఇంచార్జి ఫార్మసిస్టు ఉప్పు భాస్కర్రావు జనగాం సి.ఎం.ఎస్. ఫార్మసి అధికారి మల్లేశ్వరి రాజేందర్ తో పాటు వైద్యులు డాక్టర్ శ్రీతేజ, డాక్టర్ అశోక్, డాక్టర్ కమలహాసన్ తదితరులు పాల్గొన్నారు.