అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): మలేరియా నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ప్రాంతం నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రోజు మలేరియా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి సమావేశం మందిరంలో మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ 2016 సంవత్సరంలో 87365 మందికి మలేరియా పరీక్షలు నిర్వహించగా 304 కేసులు వచ్చాయని తెలిపారు. 2017 సంవత్సరం 58, 2018 7, 2019లో ఒకటి , 2020లో 9, 2021నుంచి 2024 సంవత్సరం వరకు రెండు చొప్పున పాజిటివ్ కేసు వచ్చాయని తెలిపారు. 2025 సంవత్సరంలో మలేరియా కేసుకు ఒకటి కూడా నమోదు కాలేదు అన్నారు. మలేరియా నిర్మూలించడం కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు పని చేయడం జరిగింది తెలిపారు. దోమల నియంత్రణ వల్లనే మలేరియా వ్యాధిని నిర్మూలించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని సూచించారు. దోమల నివారణ కోసం పరిశుభ్రతమే ముఖ్యమని సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుండి మలేరియా వ్యాధి తగ్గు ముఖం పట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వికారాబాద్ నారాయణపేట గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. 2025 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క మలేరియా పాజిటివ్ కేస్ కూడా రాలేదని తెలిపారు. తెలంగాణలోని 13 జిల్లాల్లో గత సంవత్సరం 2004లో ఎలాంటి మలేరియా కేసులు నమోదు కాలేదని తెలిపారు. 2030 సంవత్సరం నాటికి మలేరియా వ్యాధి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుముఖం పడుతుందని తెలిపారు దోమల వల్ల అనేక రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ముఖ్యంగా మలేరియా ఫైలేరియా డెంగ్యూ మెదడువాకు చిక్కుని గున్యా జికా లాంటి వ్యాధులు వచ్చా అవకాశాలు ఉన్నట్టు ఆయన వివరించారు. మలేరియా పరీక్ష కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్డిటి మలేరియా నిర్ధారణ పరీక్ష కిట్టు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత, జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్టపేల్లి వార్, డాక్టర్ అశోక్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి, అనిల్ కుమార్ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.