అదిలాబాద్, (ఆరోగ్య జ్యోతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్ మరియు శ్రేయ వ్యాధులపై మరింత ప్రచారం చేయవలసిన అవసరం ఉందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం నాడు క్షయ మరియు ఎయిడ్స్ పై అధికారులు మరియు సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ చేయ వ్యాధిపై 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి మరియు ఎయిడ్స్ వ్యాధిపై క్షయ వ్యాధి సిబ్బంది ఎయిడ్స్ శాఖ సిబ్బందితోపాటు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సహాయ సహకారులతో ప్రచారం మరింత వేగవంతం చేయాలని తెలిపారు.
టిబి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. టిబి వచ్చిన వారి కొంతమందిలో హెచ్ఐవి వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. టిబి మరియు హెచ్ఐవి వచ్చిన వారికి చికిత్సలు అందించాలని తెలిపారు.క్షయ వ్యాధి ఉందని గుర్తించిన తర్వాత వారికి చికిత్సలు అందించడంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వవలసిన అవసరం ఉందని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపై కూడా మరింత ప్రచారం వేగవంతం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేయ నివారణ అధికారి డాక్టర్ సుమలత, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెస్పిరేటరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ జాదవ్, జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గజనన్,
డాక్టర్ జి పద్మిని, సిపిఎం నాగరాజు,
జె .సుదర్శన్, బి సునీల్ కుమార్, సాయినాథ్, ఏ ఉమా, భాగ్యలక్ష్మి, భాను రేఖ సరిత ఎం సతీష్, రాజా శేఖర్ ఎయిడ్స్ మరియు క్షయ నివారణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.