మంచిర్యాల జిల్లాలో క్యాచ్ ఆఫ్ టీకల కార్యక్రమం
April 22, 2025
.మంచిర్యాల జిల్లాలో క్యాచ్ అప్ టీకాలు కార్యక్రమంలో భాగంగా సంజీవయ్య కాలనీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనర్ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశానుసారము జిల్లాలో మూడు విడతలలో తప్పిపోయిన పిల్లలకు గర్భవతులకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని ఇది ఏప్రిల్ నెలలో 21వ తేదీ నుండి 26వ తేదీ వరకు మే నెలలో 21 నుండి 26వ తారీకు వరకు జూన్ నెలలో 23వ తారీకు నుండి 30 వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేసినారు జిల్లాలో 136 వ్యాక్సినేషన్ శిబిరాల ద్వారా 240 పిల్లలకు 41 మంది గర్భవతులకు టీకాలు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరడమైనది ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఎస్ అనిత ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు జిల్లా టీకా అధికారి ఆధ్వర్యంలో జరుగుతుందని తల్లిదండ్రులు పిల్లలకు సరైన సమయంలో టీకాలు ఇప్పించగలరని గర్భవతులు సరైన సమయంలో టీకాలు తీసుకోవాలని దీని ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేసినారు జిల్లాలో రెగ్యులర్గా ప్రతి బుధవారము ఉపకేంద్రం పరిధిలో ప్రతి శనివారము గ్రామాలలో వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో వ్యాక్సినేషన్ను పూర్తి చేసినాము వీర ప్రాంతాల నుండి వచ్చేవారు పనికి వచ్చేవారు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు అదేవిధంగా జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున జాగ్రత్తలు పాటించాలని వడ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భవతులు బాలింతలు వయసు పైబడిన వారు షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పడాలి ఎండకు ఎలాంటి ప్రయాణాలు చేయరాదు అదేవిధంగా బయటకు వెళ్లినవారు టోపీ గాని రుమాలు గానీ ధరించాలి అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయము ఆ వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రతి గ్రామంలో ఓఆర్ఎస్ డిపోలు ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి ప్రజలు తమకు తాము జాగ్రత్తలు తీసుకోవాలని కోరినారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రతాప్ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి మరియు నాందేవ్ అల్లాడి శ్రీనివాస్ జగదీష్ లక్ష్మణస్వామి మూర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పాత మంచిర్యాల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు