.భూమి పరిరక్షణపై అవగాహన అవసరం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా
1970లో మొదలైన ఆధునిక పర్యావరణ విప్లవం పురస్కరించుకొని ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుతున్నారు ప్రజల్లో అవగాహన కలిగించటమే దీని ముఖ్య ఉద్దేశం అని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మంగళవారం పేర్కొన్నారు సమస్త జీవకోటి భారాన్ని మోసేది ఈ పుడమి తల్లి అని అన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా ఓవైపు కాలుష్యం పెరుగుతున్న అవేమి పట్టించుకోకుండా మనిషి తన అవసరాల కోసం ఇష్టం వచ్చినట్లుగా సహజ వనరులను తగ్గించి ఇప్పుడు ప్రాణవాయువు కోసం పరితపిస్తున్నాం పంచభూతాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి మానవ ఆరోగ్యం పై పర్యావరణ క్షీణత యొక్క ప్రభావాలు గురించి అవగాహన పెంచుకుంటూ భూమాతను కాపాడుతూ ప్రకృతిలో శాంతిని నేలకొల్పటం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా శాంసన్ తెలిపారు పర్యావరణ పరిరక్షణ కొరకు మన భూగోళాన్ని కాపాడుకోవటం కోసం చర్యలు చేపట్టాలన్నారు వాహనాల వాడకం తగ్గించాలి అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గించాలి అడవులను నాశనం చేయకుండా చెట్లను పెంచాలి మహా రుక్షాలను కాపాడుకోవాలి భూమికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరు నిషేధించాలి పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను ఉపయోగించుకోవాలి ఇంటి పరిసరాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్ కు అవకాశం ఉండే వస్తువులనే ఉపయోగించాలి ట్యాపు లీకేజీలు, బ్రష్, స్నానం, వంట, గార్డెనింగ్ వంటి పనుల్లో అవసరానికి మించి నీటిని వినియోగించకూడదని ఆయన పేర్కొన్నారు