*వరంగల్,(ఆరోగ్య జ్యోతి):వరంగల్ ఐఎంఏ హాల్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు ఆధ్వర్యం లో మంగళవారం హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ హజ్ యాత్రికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సర్వర్ ఘాజి సహకారంతో హజ్ యాత్రికులకు సంబంధించిన వ్యాక్సినేషన్ చేసారు. ఈ వ్యాక్సినేషన్ వలన ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని తెలిపినారు. పవిత్రమైన యాత్రలో పాల్గొని ఆరోగ్యవంతంగా తిరిగి రావలసిందిగా కోరినారు. కార్యక్రమం లో జిల్లా ఇమినైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాష్ పర్యవేక్షణలో వైద్యులు డాక్టర్ ఆచార్య, డాక్టర్ జునైద్ ఖాన్, డాక్టర్ కిరణ్ ,డాక్టర్ భరత్ కుమార్ ,డాక్టర్ రహేలా తన్వీర్ ,డిప్యూటీ డెమో అనిల్ కుమార్, విద్యాసాగర్, రవీందర్, నితిన్ రెడ్డి, సంజీవ్ వైద్య సిబ్బంది 55 మందికి పూర్తి వ్యాక్సినేషన్ వేశారు.వివిధ జిల్లాల నుండి వచ్చిన హజ్ యాత్రికులకు క్వార్డరి వాలెంట్ మేనిగోకకల్ మీనింజైటీస్ వ్యాక్సిన్ , సీజనల్ ఇన్ఫ్లుంజ వ్యాక్సిన్, బయో ఓరల్ పోలియో వ్యాక్సిన్ ముడు రకాల వ్యాక్సినేషన్ లు వేశారు.