సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం మరియు మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ వారి ఉచిత కంటి వైద్య శిబిరం సంతపేట సాయిబాబా మందిరం నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం శ్రీ సాయి పాద సేవకులు, ట్రస్ట్ చైర్మన్ శ్రీ అలహరి చెంచలరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ శ్రీ అలహరి చంచల్రావు మాట్లాడుతూ సంతపేటలోని సాయిబాబా మందిరం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మేము సైతం ఫౌండేషన్ వారికి మేము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ మేము సైతం ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులోని భాగంగానే ఉచిత కంటి వైద్య శిబిరం ఈరోజు సంతపేట సాయిబాబా మందిరం నందు ఏర్పాటు చేయడం జరిగింది అన్నవరపాడు, సంతపేట, రాంనగర్, అగ్రహారం గేటు పలు ప్రాంతాల్లోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కళ్ళు చెక్ చేసుకుని వారికి ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది కొంతమందికి శుక్లాలు ఉన్నాయని తెలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ సాయి పాద సేవకులు ట్రస్ట్ చైర్మన్ శ్రీ అలహరి చెంచలరావు గారికి ధన్యవాదములు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 280 మంది ప్రజలందరికీ సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ చైర్మన్ అలహరి చంచల్ రావు గారు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి కృష్ణమోహన్, మేనేజర్ వెంకట్రావు , సూర్య శ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ సర్దార్ భాష, కార్యక్రమం డైరెక్టర్ భూపతి రమేష్, చందమామ విద్యా కేంద్రం కరస్పాండెంట్ ఈవీఎస్ లక్ష్మీ , స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ PRO గోపీచంద్, హాస్పిటల్ సిబ్బంది, మేము సైతం ఫౌండేషన్ సభ్యులు,సంతపేట సాయిబాబా మందిరం భక్తులు తదితరులు పాల్గొన్నారు.