• ప్రస్తుత నవంబరు ప్రవేశాల స్థానంలో జులైలోనే ప్రవేశాలు
• నర్‌సింగ్ విద్య నాణ్యతపై అలసత్వాన్ని సహించమని స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్
• నర్సింగ్ కాలేజీల ప్రతినిధులతో మూడు గంటలకు పైగా చర్చలు
• 20 ఏళ్ల తర్వాత సమస్యలపై చర్చించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అసోసియేషన్
• నార్సింగ్ విద్యను గాడిలో పెట్టేందుకు పలు నిర్ణయాలు
అమరావతి, (ఆరోగ్య జ్యోతి):-రాష్ట్రంలో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు, నిర్వహణ మరియు విద్యా నాణ్యత ప్రక్షాళనపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం నర్సింగ్ విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు పలు నిర్ణయాల్ని తీసుకుంది. నర్సింగ్ కాలేజీల అసోసియేషన్ ప్రతినిధులు ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తో గురువారం నాడు మూడు గంటలకు పైగా పలు అంశాలపై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయంలో చర్చించారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యా రంగాన్ని మెరుగుపర్చేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులు ప్రస్తావించిన పలు సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారాలు కనుగొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నార్సింగ్ కాలేజీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పలు సమస్యలకు పరిష్కారాలను నిర్ధారిస్తున్నారు.
వివిధ కారణాల వల్ల ప్రతి ఏడాదీ నవంబరులో జరుగుతున్న ప్రవేశాలకు చరమగీతం పాడి జులై నాటి ప్రవేశాల ప్రక్రియను పూర్తి సమావేశంలో నిర్ణయించారు. నర్సింగ్ కాలేజీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని ఈ నిర్ణయం పరిష్కరిస్తుందంటూ అసోసియేషన్ స్వాగతించింది. 2025-26 విద్యా సంవత్సరంలో నర్సింగ్ కామన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పరీక్షను ప్రతి ఏడాదీ జూన్ రెండో వారంలో నిర్వహించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం అధికారులని చేపట్టారు. ఈ మేరకు ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియను ఏప్రిల్‌లో మొదలు పెట్టి జులై నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బియస్సీ (నర్సింగ్) కోర్సులను అందిస్తోంది కాలేజీల్లో ప్రతి ఏటా దాదాపు 13,000 ప్రవేశాలు జరుగుతాయి. ఇట్టి ప్రవేశాలకు కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ లో జరుగనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించే నీట్, రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంసెట్ వంటి పోటీ పరీక్షల ద్వారా నర్సింగ్ విద్యలో ప్రవేశాలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ మార్కులాధారంగా ప్రవేశాలు జరుగుతున్నా అది నర్సింగ్ విద్య చడివే వారి ప్రయోజనాలకు అవరోధంగా మారుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. బైపిసి గ్రూపుతో ఇంటర్‌లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.