సంగారెడ్డి,(ఆరోగ్య జ్యోతి):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4వ తరగతి ఉద్యోగులు ఎన్ హెచ్ ఎం లో 250 ఆయుష్ ఎస్.ఎన్.ఓ. లు పని చేస్తున్నా రాని
జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎన్. శ్రీనివాస్ వీరందరికీ వేతనాలు పెంచాలని ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేస్తున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా చాలీచాలని వేతనంతో కుటుంబాలను పోషించలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎం.పీ లు రాష్ట్రంలో మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీముల గురించి మాకు తెలియదు అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా కాంట్రాక్ట్ 4వ తరగతి బ్రతుకులు మారుతాయిని ఉద్యోగులు ఆశతో ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో గెలిపించారు కానీ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్న ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ జాతీయ ఆరోగ్య మిషన్లో నాలుగో తరగతి సిబ్బంది అనగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు బస్తీ దావఖనల సపోర్టింగ్ స్టాఫ్ గా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడున్న కేంద్ర ఎంపీ మరియు రాష్ట్ర ఎమ్మెల్యేలను మేము సూటిగా అడుగుతున్నాం 5 నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర రాష్ట్రాలలో రెగ్యులరైజ్ చేశారు. ఆ చేసిన రాష్ట్రాల జీవోలను బట్టి పర్మినెంట్ చేస్తానని చెప్పడం ఇంతవరకు చేయకపోవడం చాలా బాధాకరం, కావున వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే చాలా సంవత్సరాలు నుంచి ఉద్యోగం చేస్తున్న వారిని వితౌట్ ఎక్సమ్ వారు చేసిన డ్యూటీని వాయ పరిమితి కింద తీసుకొని రెగ్యులరైజ్ చేయగలరు కోరుతున్నాం. ఉద్యోగుల ఆశలు అడియాశలుగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనం పెంపుదల చేయకుండా పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 12 ఏళ్లుగా నిరీక్షిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల, జీవితాలు మారుతాయి అని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మెషన్ లో 4వ తరగతి ఉద్యోగుల గురించి పట్టించుకునే పాపాన పోలేదు, పైగా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసివేస్తామని ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు సిద్ధం చేస్తున్నట్టు కొన్ని వార్త పత్రికలలో వస్తున్న వార్తలు తెలుస్తుంది. దీనివల్ల ఇప్పటికే ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అసలే అనారోగ్యాలతో 2 నుండి 3 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్, పనిచేస్తున్నారు. ఉన్నపలంగా అందరిని తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఇప్పటికే చాలా మంది భయాందోళనకు గురై ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు చేపట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగో తరగతి సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేసి ఉన్నారు,ప్రాచీన వైద్య విధానం , ఆయుర్వేద యునాని, హోమియో, నేచురోపతి, లో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న
అతి తక్కువ వేతనం 10 వేల రూపాయలతో పోషిస్తున్నారు. మంత్రులకు ,ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎంత జీతం కావాలి, ఎవరి కోసం పని చేస్తున్నారు, ఉద్యోగుల బాధలు పట్టించుకోరా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఆవేదన ఒక ప్రకటనలో తెలియజేసిన జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎన్. శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు.