- ఎన్ హెచ్ ఎస్ ఆర్ బి బోర్డ్ సెక్రటరీ గోపి కాంత్ రెడ్డికి వినతి పత్రం
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి): ల్యాబ్ టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసి నెలలు గడుస్తున్న ఇంతవరకు పరీక్ష ఫలితాలను ప్రభుత్వం వెల్లడించలేదని ప్రభుత్వము ఫలితాలను వెంటనే వెల్లడించాలని ల్యాబ్ టెక్నీషియన్లు JAC డిమాండ్ చేసింది గత సంవత్సరం నవంబరులో నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని ల్యాబ్ టెక్నీషియన్ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. మంగళవారం కోఠి ఎంహెచ్ఎస్ఆర్బై కార్యాలయం ఎదుట అభ్య ర్థులు నిరసన తెలిపారు. బోర్డు కార్యదర్శి గోపి కాంత్ రెడ్డి నీ కలిసి విన్నవించారు. ఈ నెల 29న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మరియు ఫ్రెషర్స్ తో పాటు 60 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.