- జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): ప్రైవేటు ఆసుపత్రిలో నర్సింగ్ హోమ్ లో స్కానింగ్ సెంటర్లలో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు పైరు శాఖ ద్వారా సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. బుధవారం రోజు ఆదిలాబాద్ పట్టణంలోని పలు నరసింగ ఓబులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతి ప్రైవేటు నర్సింగ్ ఆసుపత్రి లలో ఏబిసి టైప్ మరియు సి ఓ 2 అగ్నిమాపక పరికరాలను ఉపయోగించాలని తెలిపారు అగ్నిమాపకం వల్ల మనువల్ అలారం పాల్ పాయింట్లను ఉపయోగించాలని ఆయన సూచించారు అగ్నిమాపక పరికరాలు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆస్పత్రిలో అగ్నిభద్రత అనేది చాలా ముఖ్యమని అక్కడ రోగులు, సిబ్బంది మరియు సందర్శకులు ఒకే చోట ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటు యని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. అగ్ని నివారణ చర్యలు, ముందస్తుగా గుర్తించే వ్యవస్థలు మరియు శిక్షణ పొందిన సిబ్బంది అగ్ని ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతా అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ అధికారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని సర్టిఫికెట్ పొందాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆసుపత్రి నరసింహం స్కానింగ్ సెంటర్లో తో పాటు తదితర వాటికి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలని తెలిపారు. లేనిపక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ ఉండడం వల్ల అటు రోగులకు ఇటు ఆసుపత్రి యజమాన్యానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. ఫైర్ జరిగిన తర్వాత మనం ఏం చేయలేదని జరగకముందు మన ఏర్పాట్లు మనం చేసుకోవాలని ఉంటుందని తెలిపారు.అగ్ని అలారం వ్యవస్థలు, స్మోక్ డిటెక్టర్లు మరియు ఫైర్ అలారం కంట్రోల్ ప్యానెల్ వంటివి ఉపయోగించడం.
అగ్ని ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం. శిక్షణ పొందిన సిబ్బంది నీ నియమించు కోవాలని తెలిపారు.
అగ్ని నివారణ మరియు అత్యవసర విధానాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం.
అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలో సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని తద్వారా ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని తెలిపారు.
గర్భస్థపూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ ప్రక్రియ చట్టరీత్యా నేరం ఈ చట్టన్ని బలోపేతం గా అమలు చేయుటలో భాగంగా నేడు ప్రత్యేక తనిఖీ బృందం జిల్లాలోని రెండు స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. క్రోమ్ ఆసుపత్రి ఆసుపత్రి,అభయనర్సింగ్ హోమ్ యజమాన్యాలతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆస్పత్రిలో అని రకాల పరికరాల సౌకర్యాలు అగ్నిమాపక వ్యవస్థ అన్ని అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన నేతృత్వంలో జరిగిన ఈ ప్రత్యేక తనిఖీ లు నిర్వహించారు. బృందంలో డాక్టర్ క్రాంతి అసిస్టెంట్ ప్రొఫెసర్ గైనకాలజీ రిమ్స్ ఆదిలాబాద్, యశోద మిషన్ కోఆర్డినేటర్, ఆ ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ అధికారి రాంప్రసాద్డి.యం.హెచ్.ఓ.కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.