ఎడిటర్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం
December 23, 2024
.అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎడిటర్ కు అక్రిడేషన్ కమిటీ మెంబర్గా అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఎడిటర్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎడిటర్ సంఘం జిల్లా అధ్యక్షులు మడుప సంతోష్ సంయుక్త కార్యదర్శి ఈ సతీష్ కోశాధికారి కదం నరేష్ ల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలు నుండి ఎడిటర్ పనిచేస్తున్నారని కలెక్టర్కు పేర్కొన్నారు. ఎడిటర్స్ అందరికీ జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక పత్రికలు మనుగడ సాగించేందుకు వీలుగా ఆర్థిక తోడ్పాటు అందించేలా ప్రభుత్వం తరఫున పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. కొత్తగా ఏర్పడే అక్రిడేషన్ కమిటీలో ఇద్దరు ఎడిటర్లకు సభ్యులుగా అవకాశం ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.