అదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పథకాల కింద పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేశారా అని అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఆరోగ్య కార్యకర్తలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలని గత సమ్మె సందర్భంగా ఆరోగ్య కార్యకర్తల కోసం ప్రభుత్వం రెండు సెప్టెంబర్ 2024 లో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు ఆ కమిటీ ప్రభుత్వ నివేదిక ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రాత పరీక్ష పెడుతుందని తెలిపారు. గత 15 నుంచి 20 సంవత్సరాల నుండి ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్నారని వారికి ప్రస్తుతం చదువుకునే పరిస్థితి లేదని పరీక్షలు రాసే రీతిలో కూడా వారు లేరని ఆయన పేర్కొన్నారు అమ్మమ్మ నానమ్మ ల వయసులో పిల్లలతో సమానంగా పరీక్ష రాయడం సాధ్యమేనా ఇది ప్రభుత్వం ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు పుష్పల, ఆనందాభాయి, తులసి, మమత ,ప్రియదర్శిని, అహల్య ,జ్యోతి ,అన్నపూర్ణ ,కరుణ ,రుక్మిణి ,పుష్పలత, రమ, అశ్విని తోపాటు తదితరులు పాల్గొన్నారు