తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్ముడు చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేసారు.. అనంతరం భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకుని అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మగాంధీ గారు తన అహింసా సిద్ధాంతంతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి వారిని దేశం నుంచి తరిమే వరకు పోరాడిన మహనీయుడని అన్నారు. మన జాతిపితగా ప్రపంచానికే ఆదర్శ నాయకుడని, ఆయన ఆశయాలు, సిద్దాంతాలు ఎన్నో దేశాలు ఆచరిస్తున్నాయని గుర్తుచేశారు. సుపరిపాలన ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా గాంధీ కలలు కన్నారని అన్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి భారతీయులకు స్వేచ్ఛనిచ్చిన మహావ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. అలాగే నిజాయితీకి నిలువెత్తు రూపం లాల్ బహదూర్ శాస్త్రి గారని గుర్తుచేశారు. ఆయన పాలనలో దేశం ఎంతో అభివృద్ధి దిశగా పయనించిందన్నారు. ఆ మహాత్ముల జీవితాలు దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయమని, వారి ఆశయ సాధనకోసం ప్రతిఒక్కరూ దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన మావల మండల్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తడిసేన వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్, సీనియర్ నాయకులు నలిమేలా నవీన్ రెడ్డి, రహీమ్ ఖాన్, మావల మండల్ NSUI అధ్యక్షులు మర్సకోల్ల గౌతమ్, పరాంకుశం వెంకటేష్, ఎంబడి బాలకృష్ణ, లస్మన్న తదితరులు పాల్గొన్నారు.