వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీమతి అనిత గారు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం గాంధీజీ గారు అనేక ఉద్యమాలు అహింసా మార్గంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నిర్వహించి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశారు మరియు కళాశాల OISA డాక్టర్ ఎం సురేష్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ గాంధీ గారి జయంతి తో పాటు లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు శాంతి మరియు అహింసా మార్గంలో అనేక రకాలైన ఉద్యమాలు చేస్తూ మన దేశ స్వాతంత్రానికి కృషి చేయడం జరిగింది. స్వాతంత్రానంతరం కూడా ఆయన మన దేశంలో అశాంతిని, అనిష్చితిని రూపుమాపడానికి నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆయన తన జీవితకాలంలో చేసిన కృషిజ్ఞాను ఆయనకు ఐక్యరాజ్యసమితి నుండి 2007వ సంవత్సరం నుంచి ప్రపంచ అహింసా దినోత్సవం గా అక్టోబర్ రెండవ తేదీని ప్రకటించడం జరిగింది ఆయన జీవిత చరిత్ర సత్యశోధన అనే పుస్తకం చదివి మరింత స్ఫూర్తిని పొందాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కళాశాల బోధన బోధనేతర ఒప్పంద అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది