జాతిపిత మహాత్మా గాంధీ భారత దేశ స్వాతంత్రం కోసం అహింస సిద్ధాంతంతో, ఆంగ్లేయులుతో పోరాడి ఆంగ్లేయులను పారదోనడానికి విశేష కృషిని చేశారని,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు అమర్ సింగ్ తిలావత్ పేర్కొన్నారు. ఈరోజు జాతి పీత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ బాబూలాల్, రాథోడ్ సురేష్ నాయక్, వినాయక రావు, జాదవ్ పవన్ మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.