రోగులకు ప్రేమ భావంతో చికిత్సలు అందించాలి
అదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్య జ్యోతి): రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించడంలో నర్సులు ముందుండాలని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నర్సింగ్ సూపర్డెంట్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నర్సింగ్ సూపర్డెంట్ వనజ అన్నారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఆమె పలు వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా నర్సింగ్ సూపర్డెంట్ వనజ మాట్లాడుతూ రోగులకు సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది నరసలేనని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నర్సులను రోగులు రోగుల బంధువులు దేవుళ్ళ లాగా కొలుస్తారని అదే రీతిలో సేవా భావంతో మనం ప్రతి ఒక్క రోగికి వైద్య సేవలు అందించడంలో ముందుండాలని తెలిపారు. సమయపాలన పాటిస్తూ సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. విధి నిర్వహణలో ముందున్నప్పుడే మనం రోగులకు సేవ చేయడంలో ముందు ఉంటామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. నర్సలంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని ఆ గుర్తింపు ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని వైద్య సేవలు అందించడంలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శారద, చందు, సుల్తా,నా మంజుల, అరుణ, సెమీకుమారి, మమత, భారతి తదితరులు ఉన్నారు. వార్తల కోసం సంప్రదించండి 9848289498,9848025451