రిమ్స్ లో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
- జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
- సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డి మల్లేష్
ఆదిలాబాద్ రిమ్స్ (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేస్తున్న కార్మికులను ఇటీవల తొలగించారని వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డి మల్లేష్ అన్నార రీమ్స్ లో పనిచేస్తున్న కార్మికులను తొలగించినందుకు గాను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశార సీనియార్టీ ప్రకారం పేషంట్ కేర్లుగా ఇవ్వాలని వారు కృష్ణ ఏజెన్సీకి డిమాండ చేశారు. రిమ్స్ లో పనిచేస్తున్న సూపర్వైజర్ పేషంట్ కేర్ రాకేష్ ను ఆరు రోజు నుండి వెదురు నుంచి తొలగించారని గత ఏడాది కాలం నుండి మల్లేష్, రజిత, రజితలను కూడా తొలగించారని వీరందరికీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని కార్మిక చట్టాలు లో ఉన్న నిబంధనను పాటించలేదని వెంటనే వీధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు, గత 12 సంవత్సరాలుగా వారు విధులు నిర్వహిస్తున్నారని ఎలాంటి కారణాలు లేకుండా విధులు తొలగించడం సబాబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నవీ,న్ రిమ్స్ యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పెరిక దేవిదాస్ ,అక్రమ్ ఉపాధ్యక్షులు పోచన్న, సుమన్తాయి నాయకులు రమేష్, అరుణ్ ,ఖలీల్ , సుమన్ తాయి,రమాకాంత్, కిరణ్ ,శాంత ,సరోజ, సుశీల ,సునీత తదితరులు పాల్గొన్నారు